September 10, 2026
Praja Telangana
తెలంగాణ

పూర్వ విద్యార్థుల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు క్రీడా సామగ్రి అందజేత

మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యాశాఖ వారోత్సవాల సందర్భంగా 1989-1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ.40 వేల విలువైన క్రీడా సామగ్రిని కళాశాలకు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ సామగ్రిని కళాశాలకు అందించారు.ఈ సందర్భంగా విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతూ ఆత్మవిశ్వాసం,శారీరక దృఢత్వం,మానసిక ఉల్లాసంతో క్రీడల్లో పాల్గొని అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని తెలిపారు.క్రీడా సమన్వయకర్త డాక్టర్ ఆర్.గోపాలకృష్ణ పూర్వ విద్యార్థుల సహకారం విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

డెంగ్యూ నివారణకు ప్రజల సహకారం అవసరం: మేయర్ ధరణి మధుకర్_ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.అనిత

*యువత ఉద్యోగాలే లక్ష్యంగా కష్టపడాలి: మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ*

Share this