September 11, 2026
Praja Telangana
తెలంగాణ

శ్రీమతి శ్రీ అయ్యగారమ్మ అంజలి, కేశిపెద్ది రామరాజు ఆధ్వర్యంలో_ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలోని దుర్గామల్లేశ్వరి ఆలయంలో శ్రీమతి శ్రీ అయ్యగారమ్మ అంజలి కేశిపెద్ది రామరాజు ఆధ్వర్యంలో రేపు (మార్చి 27, 2026) శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు వివరించారు.ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో శుభ్రత, భక్తులకు సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తులు సమయానికి హాజరై శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు.

Related posts

విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి సైకాలజిస్టుల పాత్ర కీలకం: టిపిఏ

Chief Editor: Satish Kumar

*మొక్కలు నాటి సంరక్షిస్తేనే భవిష్యత్ పర్యావరణ పరిరక్షణ*

శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ మాల ధారణతో హోమం నిర్వహణ

Share this