మంచిర్యాల, మే 16: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంచిర్యాల అరుణక్కనగర్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎస్. అనిత, మేయర్ ధరిని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్ వేల్పుల రవీందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు.అనంతరం కీటక జనిత వ్యాధుల నివారణలో సేవలు అందించిన వైద్య సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్,వైద్య అధికారులు,ఆశా కార్యకర్తలు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

