June 13, 2026
Praja Telangana
తెలంగాణ

గోవా టూర్ పేరుతో ప్రెస్ క్లబ్ పేరు దుర్వినియోగం..అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు: క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ హెచ్చరిక

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రెస్ క్లబ్ పేరుతో సాగుతున్న అక్రమ వసూళ్లతో తమ క్లబ్‌కు ఎలాంటి సంబంధం లేదని క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ (రి.నెం. 259/19) వర్కింగ్ ప్రెసిడెంట్ రామిల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, గత కొంతకాలంగా గోవా విహారయాత్ర పేరుతో కొందరు వ్యక్తులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.పట్టణంలోని కాంట్రాక్టర్లు,రాజకీయ నాయకులు,వ్యాపారులు,ప్రభుత్వ మరియు సింగరేణి అధికారుల వద్దకు వెళ్లి ప్రెస్ క్లబ్ పేరు చెప్పి గోవా యాత్ర కోసం చందాలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.ఈ తరహా వసూళ్లకు, తమ ప్రెస్ క్లబ్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.తమ క్లబ్ పేరును అడ్డుపెట్టుకొని ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఎవరైనా ప్రెస్ క్లబ్ పేరు చెప్పి డబ్బులు అడిగితే బాధితులు వెంటనే 8179560560 అనే చరవాణి నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.అక్రమ వసూళ్ల పట్ల కాంట్రాక్టర్లు,వ్యాపారస్తులు,ప్రభుత్వ మరియు సింగరేణి అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామిల్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు

Related posts

ఘనంగా వివేకవర్ధిని డిగ్రీ కళాశాల వీడ్కోలు సమావేశం

అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నీల్వాయిలో పర్యావరణ చైతన్యం

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ ఘనంగా జయంతి వేడుకలు

Share this