September 11, 2026
Praja Telangana
తెలంగాణ

అకాల వర్షాల బీభత్సం — కళ్లముందే నేలమట్టమైన పంటలు, ఆందోళనలో రైతులు

ఎండాకాలంలో ఊహించని విధంగా కురుస్తున్న అకాల వర్షాలు, గాలి దుమారాలు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న,వరి, కూరగాయల పంటలు భారీగా దెబ్బతింటున్నాయి. కోత దశలో ఉన్న పంటలు నేలకూలిపోవడం, తడిసిపోవడం వల్ల రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతోంది.మిర్చి రైతుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఎండలో ఆరబెట్టిన మిర్చి వర్షాలకు తడిసి రంగు మారిపోవడం,నాణ్యత తగ్గిపోవడం వల్ల మార్కెట్‌లో సరైన ధర దక్కడం లేదు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు పెట్టుబడి భారం రైతును ఆర్థికంగా కుంగదీస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణ పరిహారం అందించాలి. నష్టపోయిన రైతులకు వడ్డీ లేని రుణాలు, విత్తన సబ్సిడీలు, ఎరువుల సహాయం కల్పించాలి. పంట బీమా పథకాలను వేగంగా అమలు చేసి రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ స్థాయిలో పర్యటించి రైతులకు తగిన సూచనలు ఇవ్వాలి. వాతావరణ హెచ్చరికలను ముందుగానే రైతులకు చేరవేసే విధంగా ప్రత్యేక వ్యవస్థను బలోపేతం చేయాలి. పంటలను రక్షించే నిల్వ గోదాములు, ఆరబెట్టే వేదికలు గ్రామాల్లో ఏర్పాటు చేయడం కూడా అవసరం. రైతు బలంగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. ప్రకృతి విపత్తుల సమయంలో రైతుకు అండగా నిలవడం సమాజం, ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. రైతు కన్నీరు ఆగినప్పుడే గ్రామీణ భారతం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది.

Related posts

*రోడ్లపై సంచరిస్తున్న గోవుల తరలింపు.. యజమానులకు మున్సిపల్ అధికారుల సూచనలు*

యోగతో ఆరోగ్యం.. విద్యార్థులకు అవగాహన కల్పించిన చైతన్య సుధా

Share this