June 13, 2026
Praja Telangana
తెలంగాణ

సింగరేణి స్టోర్‌లో బ్యాటరీల దొంగతనం – ముగ్గురు అరెస్ట్, 25 బ్యాటరీలు స్వాధీనం

మంచిర్యాల జిల్లా మందమర్రి సీఐ తెలిపిన వివరాల ప్రకారం సింగరేణి ఏరియా స్టోర్‌లో బ్యాటరీలు దొంగతనానికి గురైన ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి కేసును చేధించారు. ఈ నెల 25న అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు,నార్లాపూర్ సమీప హైవేపై వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించిన ఆటోను అడ్డుకుని తనిఖీ చేయగా 25 బ్యాటరీలు లభించాయి.ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారించగా ఈ నెల 20న అర్ధరాత్రి సమయంలో సింగరేణి స్టోర్‌లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులు ధనకుంట్ల మునియప్ప, జన్నే నరేంద్ర, గాజుల శివప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును చేధించిన ఎస్ఐ జి.నరేష్,సిబ్బందిని సీఐ అభినందించారు.

Related posts

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ సేవల విస్తరణ – కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభం

Share this