July 29, 2026
Praja Telangana
తెలంగాణ

తీవ్ర ఎండల ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏప్రిల్–మే నెలల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు.అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.ప్రజలు ఎక్కువగా నీరు,మజ్జిగ,నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఎండలో వాహనాల్లో గ్యాస్ పదార్థాలు, లైటర్లు వంటి ప్రమాదకర వస్తువులు ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు.అలాగే అవసరం లేని ప్రయాణాలు నివారించి,ఇంట్లో చల్లని వాతావరణం కల్పించుకోవాలని సూచించారు.ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని,ప్రజలు రాబోయే ఎండ తీవ్రత గురించి అవగాహన పెంచాలని అధికారులు కోరుతున్నారు.

Related posts

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి నరేష్

వైద్యులు సూచించిన విధంగా మాత్రమే మందులు విక్రయించాలి

అలుపెరుగని కమ్యూనిస్టు, కలం యోధుడు అమరజీవి కామ్రేడ్ మునీర్ అన్నకు కన్నీటి జోహార్లు

Share this