September 13, 2026
Praja Telangana
తెలంగాణ

ఏటీఎంలో మర్చిపోయిన నగదు – మానవత్వంతో పోలీసులకు అప్పగింత

మంచిర్యాల పట్టణ టౌన్ సిఐ (ఎస్ హెచ్ ఓ)

మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంకు ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తి రూ.11,000 నగదు,ఏటీఎం కార్డు మర్చిపోయిన ఘటన చోటుచేసుకుంది.అనంతరం ఏటీఎంలోకి వెళ్లిన మరో వ్యక్తి వాటిని గమనించి వెంటనే 100 డయల్‌కు సమాచారం ఇవ్వడం జరిగింది.సమాచారం అందుకున్న వెంటనే బ్లూ కోర్టు కానిస్టేబుళ్లు సత్యనారాయణ రాజు ఘటన స్థలానికి చేరుకుని నగదు,కార్డును స్వాధీనం చేసుకున్నారు.వాటిని అప్పగించిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు నమోదు చేశారు.ఈ సందర్భంగా సీఐ నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తిని ప్రశంసించారు.అలాగే ప్రతి పౌరుడు నిజాయితీగా తన కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు. అదేవిధంగా ఏటీఎంలో నగదు,కార్డు మర్చిపోయిన వారిని మంచిర్యాల పోలీస్ స్టేషన్‌ కు వచ్చి సంప్రదించాలని కోరారు.

Related posts

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్.

*ఘనంగా కాళోజి జయంతి వేడుకలు*

Chief Editor: Satish Kumar

మంచిర్యాల కలెక్టర్‌ కుమార్ దీపక్ కు జల్ సంచయ్ జన్ భాగిదారి అవార్డు

Share this