September 11, 2026
Praja Telangana
తెలంగాణ

రామగుండం కమిషనరేట్‌లో ఇంధన కొరత లేదు-రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

* వదంతులను నమ్మవద్దు – అవసరానికి మించి నిల్వ చేయొద్దు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.మంచిర్యాల జోన్లలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నదని తెలిపారు.సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతుల కారణంగా ప్రజలు ఒకేసారి భారీగా పెట్రోల్ బంకులకు చేరుకొని వాహనాల్లో ఫుల్ ట్యాంక్‌తో పాటు క్యాన్లు, ఇతర పాత్రల్లో ఇంధనం నిల్వ చేసుకోవడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు.ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని సూచించారు. నిర్ధారించని సమాచారాన్ని నమ్మకుండా, వదంతులను పంచకుండా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Related posts

*గొర్రెల దొంగతనం కేసు ఛేదన.. నలుగురు నిందితుల అరెస్టు, గొర్రెతో పాటు మూడు ఆటోలు స్వాధీనం*

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో చర్యలు

*మంచినీటి పైపులైన్ పనులు వేగవంతం చేయాలి: మేయర్ దర్ని మధుకర్*

Share this