June 3, 2026
Praja Telangana
తెలంగాణ

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో శ్రీ నందిని నృత్యాలయం చిన్నారులు

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో శ్రీ నందిని నృత్యాలయం చిన్నారులు

మంచిర్యాల డిసెంబర్ 29,

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 27న రాత్రి దేశంలో ని వివిధ రాష్ట్రాలకు చెందిన ఒకేసారి 5700 మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కూచిపూడి కళా వైభవం-2 పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ భాగవతుల సేతురాం ఏం.ఏ, పీ.ఎచ్.డి కూచిపూడి, హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ ప్రదర్శనలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ నందిని నృత్యాలయం గురువు, అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డ్ గ్రహీత, అన్నం కల్పన శిష్య బృందం 30 మంది విద్యార్థులతో పాల్గొని నృత్యంలో ప్రతిభ కనబరిచి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డులో చోటు సాధించారు. వారి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం రాష్ట్ర గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి స్వప్నిల్ మరియు రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ను అందుకున్నారు. శ్రీ నందిని నృత్యాలయం నర్తకినులు గిన్నిస్ రికార్డులో చోటు సంపాధించుకోవడంపై మంచిర్యాల జిల్లా వాసులు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివ సేనారెడ్డి. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత, భారత్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు లలిత నృత్య కళాకారులు పాల్గొన్నారు.

Related posts

ఏటీఎంలో మర్చిపోయిన నగదు – మానవత్వంతో పోలీసులకు అప్పగింత

జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామీకం.

ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు – డాక్టర్ రాజా రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

Share this