మంచిర్యాల జిల్లా…
అక్టోబర్ 28 , 29 తేదీలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములోని ఝాన్సీ లో జరిగిన భారతీయ కళాకార్ సంఘ్ జాతీయ సమావేశానికి మంచిర్యాల జిల్లా కు చెందిన ప్రముఖ చిత్రకారుడు, చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, చిత్రకళా ఉపాధ్యాయులు ఐన చిప్పకుర్తి శ్రీనివాస్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు శ్రీనివాస్ సమావేశానికి హాజరైనారు. తన చిత్రకళలో చేస్తున్న సేవను గుర్తించి జాతీయ స్థాయి చిత్రకారుల సంస్థ ఐన భారతీయ కళాకార్ సంఘ్ లో శ్రీనివాస్ కు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా పదవి బాధ్యతలు అప్పగించి, నియామక పత్రం అందజేశారు… దేశం నలు మూలల నుండి వేల మంది చిత్రకారులు హాజరు కాగా విజయవంతంగా ముగిసిన ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు అంకూర్, జాతీయ అధ్యక్షుడు, కుమార్, యూ పి అధ్యక్షులు పాలన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాము ఆధ్వర్యంలో శ్రీనివాస్ కు నియామక పత్రాన్ని వేలమంది చిత్రకారుల సమక్షంలో అందజేసారు. రాష్ట కమిటీ ల ఏర్పాటు లో తెలంగాణ రాష్ట్ర కమిటీనీ ఏర్పాటు చేసి నియామక పత్రాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా గాజుల రాము, ఉపాధ్యక్షులుగా కొత్తురి మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాలు, ప్రచార కార్యదర్శిగా ఆంజనేయులు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కాసుల పద్మావతి, మహిళ ప్రధాన కార్యదర్శి గా సాగంటి మంజుల లను నియమించి పదవి బాధ్యతలు అప్పగించి ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమం లో శ్రీనివాస్ మాట్లాడుతూ… రాష్ట్ర కమిటీ కళాకారుల హక్కులను కాపాడి చిత్రకళకు మరింత మంచి గుర్తింపు తెస్తామని మాట ఇస్తూ, జాతీయ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు… రాష్ట్రంలో లోని చిత్రకారులు శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు…

