September 10, 2026
Praja Telangana
తెలంగాణ

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, ఏప్రిల్ 30: మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాలలో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్‌లో జరిగిన సెర్ప్ సమావేశంలో పాల్గొని స్వయం సహాయక సంఘాల సభ్యులతో మాట్లాడారు.పెట్రోల్ బంకులు, డెయిరీలు, సోలార్, స్టిచింగ్ వంటి రంగాల్లో అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని నైపుణ్యాలు పెంపొందించుకోవాలని తెలిపారు.మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, మహిళా శక్తి భవన్‌ను శిక్షణకు వినియోగించుకోవాలని చెప్పారు. వివిధ పథకాల ద్వారా యూనిట్ల స్థాపనకు ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు.

Related posts

*డ్రగ్స్‌కు దూరంగా ఉండి లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి.. బాలికల భద్రతకు షీ టీమ్స్ అండ: ఎస్‌ఐ ఉషారాణి*

*ఎమ్మెల్యే చేతుల మీదుగా ల్యాప్ టాప్ అందజేత*

Share this