శ్రీరాంపూర్,అక్టోబర్ 27 (నేటి ప్రజా తెలంగాణ): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, మహిళలు–చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించేందుకు మంగళవారం శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో షీ టీమ్స్ సహకారంతో ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ శాఖ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, దర్యాప్తులో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమాచార ప్రసార పరికరాల వినియోగం గురించి విద్యార్థులకు వివరించారు. పోలీసుల విధులు, ప్రజల భద్రత కోసం అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించారు.మహిళలు, చిన్నారుల రక్షణపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, ఇబ్బందులకు గురిచేసినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తమకు ఎదురయ్యే సమస్యలను నమ్మకమైన పెద్దలతో పంచుకోవాలని, వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణకు షీ టీమ్స్ అందిస్తున్న సేవలను కూడా వివరించారు.విద్యార్థుల్లో పోలీస్ వ్యవస్థపై అవగాహన పెంపొందించడం, పోలీసుల పట్ల నమ్మకాన్ని బలోపేతం చేయడం, మహిళలు–చిన్నారుల భద్రతపై చైతన్యం కల్పించడమే ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, షీ టీమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

