October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*క్యాతన్‌పల్లిలో నూతన సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి*

క్యాతనపల్లి,అక్టోబర్ 18(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దె రాగడిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.సెంట్రల్ లైటింగ్ అందుబాటులోకి రావడంతో రాత్రి వేళల్లో ఆ ప్రాంతం మరింత వెలుగులతో కనిపించడంతో పాటు, ప్రజల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉండనుంది. రహదారుల వెంట వెలుతురు పెరగడం వల్ల రాత్రి సమయంలో ప్రయాణించే వారికి, స్థానిక నివాసితులకు ప్రయోజనం చేకూరనుంది. పట్టణ సుందరీకరణకు కూడా ఈ ఏర్పాటు దోహదపడనుంది.ఈ ప్రారంభ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పునరావాసం,వైద్యం, ఉద్యోగాలు కావాలని బిఎస్పీ డిమాండ్

*బెల్లంపల్లి డివిజన్ కార్మికుల సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లిన టీఆర్‌వీకేఎస్ నాయకులు*

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: నెన్నెల ఎస్ఐ

Share this