October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*వాతావరణ మార్పులతో వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

మంచిర్యాల,అక్టోబర్ 5(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల శ్రీనివాస్ టాకీస్ సమీపంలోని కన్వెన్షన్ హాల్‌లో 58వ డివిజన్ కార్పొరేటర్ అనిత సత్యం బొట్ల నేతృత్వంలో సోమవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ శిబిరాన్ని ప్రారంభించారు. మొత్తం 152 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స, మందులు అందించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ నాయక్ మాట్లాడుతూ వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, వైద్య సిబ్బంది సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శిబిరాల్లో ఉచిత వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు బీపీ, షుగర్ వంటి అసంక్రమణ వ్యాధులను గుర్తించి తక్షణ చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో బొట్ల సత్యం, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, నామ్‌దేవ్, పుట్ట సత్తయ్య, శ్రీనివాస్, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తబియా, ఆర్‌బీఎస్‌కే వైద్యులు డాక్టర్ రాము, డాక్టర్ రజిత, వైద్య సిబ్బంది, దిశా సిబ్బంది, ఎన్జీవోలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

*వెంకటాపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌కు కొత్త దిశ.. ఉచిత వైద్య శిబిరంతో పోలీసుల సేవాభావం*

తెలంగాణకు తరలిస్తున్న దేశీదారు మద్యం పట్టివేత

బెల్లంపల్లి, పట్టణంలో రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

Share this