బెల్లంపల్లి, సెప్టెంబర్ 6 (నేటి ప్రజా తెలంగాణ): శాంతిఖని ప్రాంతంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ 05.09.2026 సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో, శాంతిఖనిలో బాధిత బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా, వారి ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న కాంపెల కిష్టయ్య బాలికను తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకోవడంతో, తల్లి విషయాన్ని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి 2 టౌన్ ఎస్సై సీహెచ్ తిరుపతి కేసు నమోదు చేశారు.అనంతరం బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ హనోక్ కేసు దర్యాప్తు చేపట్టి, ఆదివారం మధ్యాహ్నం నిందితుడు కాంపెల కిష్టయ్యను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

