October 3, 2026
Praja Telangana
తెలంగాణ

*విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన*

మంచిర్యాల, సెప్టెంబర్ 19 (నేటి ప్రజా తెలంగాణ): రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. హన్నన్ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. హన్నన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి నిబంధనలు పాటిస్తూ నిర్ణీత వేగ పరిమితిలో వాహనాలు నడపాలని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్‌ఫోన్ వినియోగించడం, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.యువత వాహనాలు నడిపే సమయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని, తమ నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు తాము ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిసరాల్లోని వారికి కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Related posts

*నేత్రదానంతో చూపులేని జీవితాల్లో వెలుగులు నింపాలి: డి ఎం హెచ్ ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

వర్కింగ్ జర్నలిస్టులకు సింగరేణి క్వార్టర్లు కేటాయించండి

*జైపూర్ ఎస్‌టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో కమ్యూనిటీ కాంటాక్ట్.. 41 వాహనాలు సీజ్*

Share this