రామకృష్ణాపూర్,ఆగస్టు 31,(నేటి ప్రజా తెలంగాణ):రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలను పర్యవేక్షించడంలో భాగంగా ఈ తనిఖీ నిర్వహించారు.తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఏసీపీ, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. వివిధ నేరాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమబద్ధంగా ఉంచాలని ఎస్సై శ్రీధర్‌ను ఆదేశించారు.అనంతరం ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి అక్కడి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను చట్టపరమైన విధానంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.స్టేషన్‌లో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పరిష్కారానికి పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించిన కిరణ్ కుమార్, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, నమోదులను కూడా పరిశీలించారు.అనంతరం ఎస్సై, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో సమావేశమై కేసుల వివరాలను అంతర్జాలంలో నమోదు చేయడం, సంబంధిత రికార్డులను సక్రమంగా పొందుపరచడం వంటి అంశాలపై ఆరా తీశారు.ఈ తనిఖీలో మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.రమేష్ పాల్గొన్నారు.
previous post

