మంచిర్యాల,ఆగస్టు 17: మంచిర్యాల పట్టణంలోని గొల్లవాడ యూనియన్ ఆఫీస్ సమావేశ మందిరంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల గర్మిళ్ల ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డా. నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రక్తపోటు, మధుమేహం నిర్ధారణ అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు.లయన్స్ క్లబ్ మంచిర్యాల గర్మిళ్ల చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అమూల్యమైనవని డీఎంహెచ్‌ఓ కొనియాడారు.ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మోతిబిందు శస్త్రచికిత్సలకు అర్హులను గుర్తించి, వారిని కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి ప్రత్యేక వాహనంలో తరలించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు.ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాల ఫ్రేమ్‌లను పంపిణీ చేశారు. కంటి సమస్యలతో వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు.అనంతరం జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఆరోగ్యం, నేత్ర సంరక్షణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సదానందం, వెంకటేశ్వర్లు,లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గుర్రాల చక్రధర్ రావు, జోనల్ చైర్‌పర్సన్ ముఖేష్, అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, కార్యదర్శి కాసం మల్లికార్జున్,ఐ క్యాంప్ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాందేవ్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్యులు,ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

