September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*మంచిర్యాలలో యువతకు 45 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణ*

మంచిర్యాల, ఆగస్టు 12:తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక విద్య, ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలో విద్యార్థులు, ఉద్యోగాన్వేషకులకు 45 రోజుల పాటు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ శిక్షణ కార్యక్రమం ఆగస్టు 24, 2026 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు, ఉద్యోగాన్వేషకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా వివిధ సాంకేతిక అంశాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, తార్కిక ఆలోచనా సామర్థ్యం, ఉద్యోగ ఇంటర్వ్యూలను ఎదుర్కొనే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

శిక్షణలోని అంశాలు

– సీ ప్రోగ్రామింగ్‌
– హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌
– జావా
– పైథాన్‌
– సామర్థ్య పరీక్షలు, తార్కిక ఆలోచనా విధానం
– ఉద్యోగ ఇంటర్వ్యూ నైపుణ్యాలు

ఈ శిక్షణ ద్వారా యువతలో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వివిధ రంగాల్లో లభించే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దనున్నారు.అర్హత,ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆగస్టు 13 నుంచి 19వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో మంచిర్యాలలోని ఐడీఓసీ భవనంలోని జీ-13 గదిలో సంప్రదించాలి.మరిన్ని వివరాల కోసం 7989733351,9676535290 నంబర్లలో సంప్రదించవచ్చని మంచిర్యాల ప్రాంతీయ కేంద్రం నిర్వాహకులు తెలిపారు.

Related posts

*దొరికిన మొబైల్‌ను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న 80 ఏళ్ల వృద్ధుడు.. కనకయ్యకు ఎస్సై శ్రీధర్ అభినందనలు*

తీవ్ర ఎండల ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

*మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. హానికర విషయాలకు ధైర్యంగా నో చెప్పాలి : మంచిర్యాల డీసీపీ భాస్కర్*

Chief Editor: Satish Kumar
Share this