September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*గాంధారి ఖిల్లాలో తప్పిపోయిన వృద్ధురాలు.. గంటల వ్యవధిలోనే గుర్తించిన రామకృష్ణాపూర్ పోలీసులు*

రామకృష్ణాపూర్, ఆగస్టు 6: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాంధారి ఖిల్లా జాతరకు వచ్చిన ఓ వృద్ధురాలు తప్పిపోగా, పోలీసులు, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో చేపట్టిన గాలింపు చర్యల ఫలితంగా ఆమెను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి ఖిల్లాకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన పెద్దవ్వ తల్లి గంగవ్వ గురువారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో కుటుంబ సభ్యుల నుంచి విడిపోయి కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే రామకృష్ణాపూర్ పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించారు.గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఎస్‌సీసీ క్వారీ సఫారీ రూట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన అటవీ శాఖ కెమెరాలను పరిశీలించగా గంగవ్వ అడవి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ గాలింపు కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ జై శ్రీధర్ తన సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేసి వృద్ధురాలిని క్షేమంగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించారు.వృద్ధురాలిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు పోలీసు శాఖ, అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

Share this