August 5, 2026
Praja Telangana
తెలంగాణ

*మంచిర్యాల జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు…తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి: డి ఎం హెచ్ ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

చెన్నూరు,ఆగస్టు 01: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో తల్లిపాల ప్రాముఖ్యతపై మహిళలు, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించనున్నారు.తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు, తల్లి మరియు బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా శిశువు జన్మించిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం, తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై తల్లులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లాలో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, చెన్నూరు మరియు కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో వైద్యులు, సూపర్‌వైజర్లు, వైద్య సిబ్బంది, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని సూచించారు. స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సమన్వయంతో గ్రామస్థాయిలో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు.తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి తల్లికి అవగాహన కల్పించడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచవచ్చని అధికారులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు, తల్లులు మరియు శిశువుల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, CHOలు నాందేవ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అల్లాడి శ్రీనివాస్, ప్రశాంతి, వైద్య సిబ్బంది, ఆశా మరియు ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*పెద్ది చిత్రపటానికి పాలాభిషేకం.. అభిమానుల సంబరాలు అంబరాన్నంటిన వేళ: యువ నాయకుడు సిద్దు*

*యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్–2026 ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య*

*మంచినీటి పైపులైన్ పనులు వేగవంతం చేయాలి: మేయర్ దర్ని మధుకర్*

Share this