August 5, 2026
Praja Telangana
తెలంగాణ

*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రం పరిశీలన*

మంచిర్యాల, జులై 30: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాన్ని విశ్వవిద్యాలయ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను వెల్లడిస్తూ విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి సేవల విభాగం సంచాలకుడు డాక్టర్ వై. వెంకటేశ్వర్లు, విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్ ప్రొఫెసర్ బి. శ్రీనివాస్, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్. కిషోర్ అధ్యయన కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో వాణిజ్య శాస్త్రంలో స్నాతకోత్తర కోర్సును నూతనంగా ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు, రుసుముల చెల్లింపునకు ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు.అదేవిధంగా, ఈ విద్యా సంవత్సరంలో సైన్స్ మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థుల ప్రయోగాత్మక తరగతులకు కూడా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే అనుమతి కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాలను విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత విద్యను కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా,అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ ఎస్.నరేందర్ రెడ్డి,అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బెల్లంపల్లి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి

*నెన్నెల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ.భాస్కర్*

Chief Editor: Satish Kumar

తాండూర్, అండర్ బ్రిడ్జిలో వాటర్ జామై ఇబ్బంది పడుతున్న జనం

Share this