July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగతం.. ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ*

మంచిర్యాల, జులై 21: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్తగా మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ కళాశాల విద్యా వైభవం, సాధించిన విజయాలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను వివరించారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించేలా కళాశాలలో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, అంకితభావంతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నరేందర్ రెడ్డి, జిల్లా దోస్త్ సమన్వయకర్త కుమారస్వామి, గంగయ్య, హరీష్ కుమార్, గోపాలకృష్ణ, రాజయ్య, మహేష్ కుమార్, అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

*ప్రజలకు చట్టబద్ధంగా, మర్యాదపూర్వకంగా సేవలందించాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

మహానాడు 2025 వేడుకకు అందరూ కదలిరండి

బెల్లంపల్లి, పట్టణంలో రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

Share this