September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. రూ.20 లక్షల వరకు ఉపకార వేతనం: జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్*

మంచిర్యాల,జూలై 1:2026 సంవత్సరానికి గాను అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి స్ప్రింగ్ ఇంటెక్ కొరకు అర్హులైన షెడ్యూల్డ్ కులములకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విదేశీ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఉపకార వేతనం అందించుటకు నిర్ణయించడం జరిగిందని, యు ఎస్ ఏ, యు కె, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియ, న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సులలో చదవాలనుకుంటున్న షెడ్యూల్డ్ కులముల విద్యార్థులు స్ప్రింగ్ ఇంటెక్ కొరకు ఈ నెల 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో www.telangana.epass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు జిల్లా వాసులై షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారై ఉండాలని, వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలకు మించి ఉండకూడదని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి గ్రాడ్యుయేషన్ లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలని, టి ఓ ఈ ఎఫ్ ఎల్ / ఐ ఈ ఎల్ టి ఎస్ / జి ఆర్ ఈ/ జి ఎం ఎ టి ఎక్కువ శాతం అర్హత కలిగి ఉండాలని, పాస్పోర్ట్, వీసా కలిగి ఉండాలని, విదేశీ విశ్వవిద్యాలయం నందు అడ్మిషన్ పొంది ఉండాలని, ఒక కుటుంబం నుండి ఒక్కరు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత కల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Related posts

*అధిక ధరల పుస్తకాల విక్రయాలపై విద్యాశాఖ కొరడా.. ట్రినిటీ బుక్ స్టాల్ వ్యవహారంలో అనుమానాలు, జై శ్రీ బట్టల షాప్ సీజ్.. అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశాలు: విద్యాశాఖ పిడి లలిత*

Chief Editor: Satish Kumar

నిజమైన పాత్రికేయతకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్ కుమార్ దీపక్

రాష్ట్ర ప్రభుత్వం సంచార కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Share this