July 27, 2026
Praja Telangana
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

*జనసేన పుట్టిందే తెలంగాణలో__రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తాం: పవన్ కళ్యాణ్*

హైదరాబాద్,జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణతో జనసేనకు ఉన్న అనుబంధం కేవలం రాజకీయ సంబంధం కాదని, పార్టీ పుట్టుక నుంచి తెలంగాణ భావజాలం తనలో అంతర్భాగంగా ఉందని స్పష్టం చేశారు.జనసేన పుట్టిందే తెలంగాణలో.అందుకే తెలంగాణ ప్రజలతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది.రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు,ఆశయాల కోసం ఇక్కడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.తెలంగాణ రాజకీయాల్లో జనసేన తనదైన ముద్ర వేయబోతోంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇంకా ప్రజల హృదయాల్లో అంతర్వాహినిలా కొనసాగుతోందని,ఆ భావోద్వేగాలను గౌరవిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం,హక్కుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు.తెలంగాణ అంటే గౌరవం,స్వాభిమానం అనే భావనను కొత్తగా వివరించాల్సిన అవసరం లేదని,ఆ ఉద్యమం వెనుక ఉన్న త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.ఒకప్పుడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారే ఇప్పుడు తెలంగాణకు మద్దతుదారులమని చెప్పుకోవడం రాజకీయ వైరుధ్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే చర్యలు ఎక్కడ జరిగినా జనసేన నిశ్శబ్దంగా ఉండదని, తెలంగాణకు ద్రోహం జరిగితే ప్రజల తరఫున గొంతెత్తే పార్టీ జనసేనేనని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే రాజకీయ కక్షసాధింపు ధోరణులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.రాజకీయ ఒత్తిళ్లు,విమర్శలు,బెదిరింపులకు భయపడేది లేదని,ప్రజా ప్రయోజనాలే తమ రాజకీయాల కేంద్రబిందువని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.తెలంగాణలో అడుగుపెట్టనివము అని నాయకులు చాలా రకాలుగా నన్ను అడ్డుకోవడం జరిగిందని,తెలంగాణ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగం అని గుర్తు చేశారు తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని,గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత విస్తరిస్తామని వెల్లడించారు.
మాధ్యమాలు ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని పేర్కొన్న పవన్ కళ్యాణ్, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమన్నారు.ప్రజల సహకారం, మీడియా మద్దతుతో తెలంగాణలో జనసేనను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, అభివృద్ధి,పారదర్శక పాలన, ప్రజా సంక్షేమమే జనసేన లక్ష్యమని పునరుద్ఘాటించారు.తెలంగాణ గడ్డపై జనసేన అడుగులు మరింత బలంగా పడతాయి..ప్రజల కోసం,రాష్ట్ర ప్రయోజనాల కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Related posts

బెల్లంపల్లి బాలికలకు షీ టీం అవగాహన కార్యక్రమం

గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ.

సి సి రోడ్డు పక్కలకు మట్టి వేయాలి*

Share this