June 3, 2026
Praja Telangana
తెలంగాణ

బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కొనసాగింపు

అనుమతులు లేని డ్రోన్, డిజె సౌండ్స్ పై చర్యలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. మద్యం సేవించి వీధుల్లో, రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని, మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంలో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు 2025 డిసెంబర్ 1 నుండి 2026 జనవరి 1 వ తారీఖు వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం, కాలం దృష్ట్యా పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు. బిఎన్ఎస్ (భారతియ న్యాయ సంహిత) 223, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, 1348 ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.

డీజే, డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడగింపు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో డీజే సౌండ్ ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడగించమని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని సిపి తెలిపారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించమని తెలిపారు. వివిధ కార్యక్రమాల సందర్బంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజే సౌండ్ల్ వినియోగిస్తున్నారని అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి ల అనుమతి పొందాలని సూచించారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు ఏ స్థాయిలో మైక్ సెట్ లో వినియోగించాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు 2025 డిసెంబర్ 1 నుండి 2026 జనవరి 1 వ తారీఖు వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం, కాలం దృష్ట్యా పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు. బిఎన్ఎస్ (భారతియ న్యాయ సంహిత) 223, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, 1348 ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ల పరిధిలో రామగుండం పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (ఎ)నుండి (ఎఫ్ ), 22 (2) (ఎ) & (బి), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 నంబరు IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం 2025 డిసెంబర్ 1 ఉదయం 6 గంటల నుండి 2026 జనవరి 1 వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఆమలులో వుంటుందని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

Related posts

డాక్టర్ సుతి గోలి గారికి బహుజన్ సమాజ్ పార్టీ ఘన సన్మానం

తెలంగాణ అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా మహిళ కన్వీనర్ గా మద్దెల భావని*

Share this