July 28, 2026
Praja Telangana
తెలంగాణ

ఘనంగా కార్మికుల దినోత్సవం వేడుకలు నిర్వహించాలి: కలెక్టర్ కుమార్ దీపక్

మే 1వ తేదీన జిల్లాలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో మే 1వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న వేడుకలకు కార్మికులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జిల్లాలోని మండలాలలో జరిగే వివిధ కార్యక్రమాలను ప్రజలు, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Related posts

ఎల్ నినో’ ప్రభావం తీవ్రతరం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

*భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి రికార్డుల పరిశీలనతో పారదర్శకంగా భూ సర్వే చేపట్టాలి: కలెక్టర్ కుమార్ దీపక్*

అరుదైన “మే పుష్పం”తో ఆకట్టుకుంటున్న గుండేటి యోగేశ్వర్ ప్రకృతి మిత్ర నిలయం

Share this