October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రవీంద్రఖని ప్రెస్‌క్లబ్ అండ*

మందమర్రి అక్టోబర్ 2(నేటి ప్రజా తెలంగాణ):మందమర్రి మండలంలోని గుడిపల్లి, వెంకటాపూర్, పొన్నారం గ్రామాల్లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను రవీంద్రఖని ప్రెస్‌క్లబ్ సభ్యులు శుక్రవారం పరామర్శించారు. మృతుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి దుఃఖంలో భాగస్వాములయ్యారు.ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు దుస్స శివప్రసాద్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రామిల్ల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ పోలుదాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రామిడి సృజన్, జాయింట్ సెక్రెటరీ కందుల ప్రవీణ్ తదితరులు ఆయా గ్రామాలను సందర్శించారు. చింతకుంట లక్ష్మి, సోనియా, తొగరి సుమలత, రాంటెంకి దివ్యవాణి, అగ్గు సౌందర్య కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా దివ్యవాణి పిల్లలు తమ తల్లి ఇక లేదంటూ అమాయకంగా చెప్పిన మాటలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. కుటుంబ పోషణ కోసం దూర ప్రాంతాలకు వెళ్లి కష్టపడి పనిచేస్తున్న యువతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని దుస్స శివప్రసాద్ అన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ప్రెస్‌క్లబ్ సభ్యులు కోరారు.పరామర్శ కార్యక్రమానికి మూడు గ్రామాల సర్పంచులు సెగ్యం వెంకటేష్, మధు, ఉపసర్పంచ్ సిద్ధం నరేందర్ సహకరించారు.

Related posts

*బహిరంగ మద్యం సేవనంపై నిషేధం కొనసాగింపు: సీపీ అంబర్ కిషోర్ ఝా*

*అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు: జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ అఖిల్ మహాజన్*

*ప్రతి గింజకు న్యాయం:నమ్నూర్_గుడిపేట కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి*

Chief Editor: Satish Kumar
Share this