October 3, 2026
Praja Telangana
తెలంగాణ

*రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేంద్ర రాథోడ్*

మంచిర్యాల, సెప్టెంబర్ 30(నేటి ప్రజా తెలంగాణ):అక్టోబర్ 1న నిర్వహించనున్న జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్త సహాయ ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్, లైన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్వర్లు కలిసి అవగాహన కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ నరేంద్ర రాథోడ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రక్తం అందుబాటులో లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, అందువల్ల ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగి, కనీసం 45 కిలోల బరువు ఉన్న ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చని తెలిపారు. రక్తదానం సురక్షితమైన ప్రక్రియ అని, రక్తదాతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. సేకరించిన రక్తాన్ని అవసరమైన అన్ని పరీక్షలు చేసిన అనంతరం రోగులకు వినియోగిస్తారని వివరించారు.ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం, రక్తహీనత, క్యాన్సర్, సికిల్ సెల్, తలసీమియా వంటి అనేక పరిస్థితుల్లో రక్తం అవసరమవుతుందని తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. స్వచ్ఛంద రక్తదానం ద్వారా ఒక దాత రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని తెలిపారు.జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్, లైన్స్ క్లబ్‌లు, ఎన్‌జీవోలు, ఎన్‌సీసీ సభ్యులు రక్తదాన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌వో కోరారు. అక్టోబర్ 1న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సహకారంతో రక్తదాన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్‌వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, సంచాలకులు విశ్వేశ్వర్ రెడ్డి, వైద్య సిబ్బంది, లైన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

Related posts

*ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ.. పరిష్కారానికి సీపీ ఆదేశాలు *

*పోలీసులకు రాఖీలు కట్టిన పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు*

*వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఆర్‌డీఓ శ్రీనివాసరావు*

Chief Editor: Satish Kumar
Share this