October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*బొక్కలగుట్ట సర్వీస్ రోడ్డు పనులపై డీసీపీ భాస్కర్ పరిశీలన*

బొక్కలగుట్ట, సెప్టెంబర్ 22(నేటి ప్రజా తెలంగాణ):రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామ సమీపంలో జాతీయ రహదారి వెంట చేపడుతున్న సర్వీస్ రోడ్డు, అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంచిర్యాల డీసీపీ ఎగ్ండి భాస్కర్ మంగళవారం పరిశీలించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గాంధారి మైసమ్మ సమీపంలోని ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.సర్వీస్ రోడ్డు లేకపోవడంతో రహదారిపై రాకపోకలు సాగించే గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యను పోలీసుశాఖ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో సర్వీస్ రోడ్డు, అండర్ బ్రిడ్జి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో జాతీయ రహదారుల సంస్థ సహకారంతో 14 విద్యుత్ స్తంభాలతో సెంటర్ లైటింగ్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో మందమరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. రమేష్, రామకృష్ణాపూర్ ఎస్సై జె. శ్రీధర్, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, బొక్కలగుట్ట సర్పంచ్ శ్రీనివాస్, బొలిశెట్టి కనకయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

*డ్రగ్స్‌కు దూరంగా ఉండి లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి.. బాలికల భద్రతకు షీ టీమ్స్ అండ: ఎస్‌ఐ ఉషారాణి*

ప్రాణం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తాం__ తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు సిద్దు

కన్నాల సర్వే 60లోనే సమగ్ర పాఠశాలని నిర్మించాలి ప్రజల డిమాండ్

Share this