October 3, 2026
Praja Telangana
తెలంగాణ

*ఒక చుక్క రక్తదానం.. ఎన్నో ప్రాణాలకు జీవదానం: డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్*

మంచిర్యాల,సెప్టెంబర్ 19(నేటి ప్రజా తెలంగాణ):జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రక్తదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ర్యాలీని ప్రారంభించారు. రక్తదానం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగింది.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, సికిల్‌సెల్, తలసీమియా, అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు రక్తం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న జిల్లాలో రక్తదాన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు రక్తదానంపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఈ ర్యాలీలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ శ్రీధర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రషీద్, అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, పుట్ట సత్తయ్య, వెంకటేశ్వర్లు, డాక్టర్ రమ్య, డాక్టర్ అమన్, రెడ్‌క్రాస్ ప్రతినిధి మహేందర్, తలసీమియా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఐసీటీసీ, దిశా సిబ్బంది, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మాంసం విక్రయాలు.. హోటల్‌ను మూసివేసిన క్యాతనపల్లి పురపాలక అధికారులు*

బీసీ రిజర్వేషన్ల ప్రదాత, భారత దేశ మాజీ ప్రధాని వీపీ సింగ్ జయంతి వేడుకలు

సామాజిక దళితోద్ధారకుడు బాబు జగ్జీవన్ రామ్

Share this