మంచిర్యాల,సెప్టెంబర్ 18(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ 100 ఫీట్ రోడ్డులో అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడిని మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. కాలనీవాసులు ఐక్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సోదరభావం, ఐక్యత పెంపొందుతాయని తెలిపారు. తొమ్మిది రోజులపాటు నిరంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న అంజనీపుత్ర ఎస్టేట్ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులను ఆర్డీఓ అభినందించారు. స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించిన అంజనీపుత్ర ఎస్టేట్ చైర్మన్ గుర్రాల శ్రీధర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

