October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*గణేష్ నవరాత్రుల్లో డీజేలకు అనుమతి లేదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ జై. శ్రీధర్*

రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 12 (నేటి ప్రజా తెలంగాణ):
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే నిర్వాహకులకు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఉత్సవాల సమయంలో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులకు గురయ్యే విధంగా అధిక శబ్దంతో డీజేలు నిర్వహించరాదని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు లోబడి నిర్వహించాలని డీజే నిర్వాహకులకు సూచించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ జె. శ్రీధర్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల సమయంలో ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts

*గాంధారి బోనాల జాతరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.. ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల ప్రత్యేక దృష్టి*

తెలంగాణలో రాజకీయ విస్తరణకు జనసేన కార్యాచరణ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా

బెల్లంపల్లి గురుకుల విద్యార్థుల ఆందోళన

Share this