September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.. చెన్నూర్‌లో జనసేన శ్రేణుల సందడి*

మంచిర్యాల జిల్లా, సెప్టెంబర్ 2 (నేటి ప్రజా తెలంగాణ): చెన్నూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు సిద్ధూ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు చెన్నూర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చెన్నూర్ పాత బస్టాండ్‌లో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అభిమానులు సందడి చేశారు.అనంతరం అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు థియేటర్లలో పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఆయన నటించిన ‘పంజా’ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా టికెట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలు, శ్యామ్, నవీన్ గంధం, సాయి మామిడి, పొన్నం సాయి, రఘు, హరీష్, సాయి కిరణ్, ఆడేటి సాయికుమార్, ఆంజనేయ ప్రసాద్, ప్రశాంత్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

*క్రైమ్ నియంత్రణలో రామగుండం పోలీసుల సత్తా.. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ*

కుల గణన సాధించడంలో కీలక పాత్ర పోషించిన బీసీ ఉద్యమకారుడు గుమ్ముల శ్రీనివాస్ కి సన్మానం

*నేరాల నియంత్రణలో రాజీ లేదు.. సాంకేతిక దర్యాప్తు, విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి : డీసీపీ ఎ. భాస్కర్*

Share this