September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*సెల్‌ఫోన్ వదలండి.. నైపుణ్యాలు నేర్చుకోండి*

మంచిర్యాల,సెప్టెంబర్ 1(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోహమ్ అకాడమీ, హైదరాబాద్ సహకారంతో విద్యార్థులకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రోబోటిక్స్‌పై ఆసక్తి కలిగి, పాఠశాల విద్యార్థులను ప్రేరేపించాలనే ఆసక్తి ఉన్న కళాశాల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోబోటిక్స్‌పై ప్రత్యక్ష శిక్షణ అందించారు. శిక్షణ పొందిన విద్యార్థులకు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు నిర్వహించే అవకాశంతో పాటు నూతన ఆవిష్కరణల ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి రోబోటిక్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించినందుకు రోజువారీగా ఉపకార వేతనం అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే శిక్షణ పొందిన వారికి అనుభవ ధ్రువపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా కళాశాల ఉప ప్రిన్సిపాల్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, నేటి యువత సెల్‌ఫోన్లకే పరిమితం కాకుండా సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవాలని అన్నారు. రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాలపై అవగాహన పెంచుకుని భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గంగయ్య, కుమారస్వామి, గోపాలకృష్ణ, కంప్యూటర్ విభాగం బాధ్యుడు రసూల్, భౌతికశాస్త్ర విభాగం బాధ్యురాలు ఫర్హా, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

*రామకృష్ణాపూర్‌లో రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచన*

*లాడ్జ్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలి.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు*

*ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించాలి: కలెక్టర్ కుమార్ దీపక్*

Share this