September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి రిమాండ్*

మంచిర్యాల, ఆగస్టు 31 (నేటి ప్రజా తెలంగాణ): మంచిర్యాల పట్టణంలో వాహనాల తనిఖీ సందర్భంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించి, రోడ్డుపై వీరంగం సృష్టించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మంచిర్యాల పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 30వ తేదీ రాత్రి బ్లూ కోర్టు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ఎం. తిరుపతి, రాకేష్‌లు బీసీ-2 ఏరియాలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో మంచిర్యాల బస్టాండ్ ఎదుట ఎస్సై మజారుద్దీన్ సమక్షంలో వాహనాల తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు హోండా యాక్టీవా స్కూటీపై వెళ్తుండగా, తనిఖీల్లో భాగంగా బ్లూ కోర్టు సిబ్బంది వాహనాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. స్కూటీపై మధ్యలో కూర్చున్న నలిగేటి వివేక్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ఉద్దేశించి అనుచితంగా ప్రవర్తిస్తూ, రోడ్డుపై న్యూసెన్స్ సృష్టించినట్లు తెలిపారు.పోలీసులు పలుమార్లు వారించినప్పటికీ వినకుండా, మద్యం మత్తులో అసభ్య పదజాలంతో దూషిస్తూ గట్టిగా అరుస్తూ గొడవకు దిగినట్లు తెలిపారు. అంతేకాకుండా విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపైకి వస్తూ వారి విధులకు ఆటంకం కలిగించినట్లు పేర్కొన్నారు.దీంతో నలిగేటి వివేక్‌పై పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోమవారం అతడిని గౌరవ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు మంచిర్యాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.

Related posts

*ఎసన్వాయి గ్రామంలో గుడుంబా స్థావరాలపై పోలీసు–ఎక్సైజ్ సంయుక్త ఉక్కుపాదం*

*వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి.. వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్*

Share this