September 13, 2026
Praja Telangana
తెలంగాణ

*ప్రధాని ప్రసంగాన్ని వీక్షించిన కళాశాల విద్యార్థులు*

మంచిర్యాల,ఆగస్టు 27(నేటి ప్రజా తెలంగాణ): మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఖేల్ ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడం, యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారికి మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ‘ఖేల్ కీ బాత్–ప్రధాని కే సాత్’ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రత్యక్ష ప్రసంగాన్ని కళాశాల విద్యార్థులు వీక్షించారు.ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందించడంతో పాటు దేశానికి మంచి క్రీడాకారులను అందించేందుకు దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అనంతరం మంచిర్యాల జిల్లా బాక్సింగ్ శిక్షకుడు సీహెచ్ రాజేశ్, జాతీయ స్థాయి బాక్సింగ్ క్రీడాకారులు, మై భారత్ స్వచ్ఛంద సేవకురాలు స్పూర్తి రెడ్డిని శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎం. కుమారస్వామి, డాక్టర్ కే. రాజయ్య, అధ్యాపకులు డాక్టర్ టి. గంగయ్య, డాక్టర్ ఆర్. గోపాల్ కృష్ణ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

*తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలి: డి ఎం హెచ్ ఓ డాక్టర్.నరేందర్ రాథోడ్*

*ప్రతి గింజకు న్యాయం:నమ్నూర్_గుడిపేట కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి*

Chief Editor: Satish Kumar

తాండూర్, అండర్ బ్రిడ్జిలో వాటర్ జామై ఇబ్బంది పడుతున్న జనం

Share this