September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*త్వరలోనే క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక*

క్యాతనపల్లి, ఆగస్టు 21(నేటి ప్రజా తెలంగాణ):క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుక్రవారం స్థానిక ఠాగూర్ స్టేడియంలో ప్రెస్ క్లబ్ ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలవల శంకర్, కోఆర్డినేటర్ దుస్సా శివప్రసాద్ మాట్లాడుతూ ఏడాది కాల పరిమితి ముగియడంతో ప్రస్తుత కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే పారదర్శకంగా నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు.జర్నలిజంలో నూతన ఉత్సాహం, నిబద్ధతతో పనిచేసే విలేకరులను క్యాతనపల్లి ప్రెస్ క్లబ్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు విలేకరుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కనుకుంట్ల సుభాష్, రామిళ్ల శ్రీనివాస్, పరికిపండ్ల రాజు, పోలు దాసరి శ్రీనివాస్, మామిడాల రవీందర్, మెరుగు నారాయణ, కరెడ్ల రఘు, ప్రవీణ్ కుమార్, తూముల భవిష్యత్తు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*గణేష్ మండళ్లకు పోలీసుల సూచన…. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి*

Chief Editor: Satish Kumar

*గనుల మూసివేత ప్రభావిత ప్రాంతాల్లో పరిరక్షణ చర్యలు చేపట్టాలి: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి*

*హెచ్‌ఐవీ నియంత్రణకు ముమ్మర చర్యలు.. డిసెంబర్ 1లోపు లక్ష్యాల సాధనకు కలెక్టర్ ఆదేశం*

Share this