మంచిర్యాల,ఆగస్టు 19 (నేటి ప్రజా తెలంగాణ): హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస కార్యక్రమంలో మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అర్థశాస్త్ర విభాగంలో తమ ప్రదర్శనను నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంచిర్యాల కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు సీహెచ్ ప్రేమ్‌సాయి, ఈ. సాయికుమార్, పి. పేత్రు, శ్రుతి అర్థశాస్త్ర విభాగంలో తమ ప్రదర్శనను సమర్పించారు. విద్యార్థులకు కళాశాల అర్థశాస్త్ర విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఆర్. గోపాల్‌కృష్ణ పర్యవేక్షకులుగా వ్యవహరించి అవసరమైన సలహాలు, సూచనలు అందించారు.విద్యార్థుల ప్రదర్శనను కార్యక్రమ నిర్వాహకులు, ఉన్నతాధికారులు అభినందించారు. రాష్ట్రస్థాయి కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరచడం కళాశాలకు గర్వకారణమని కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ జైకిషన్ ఓజా తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించిన అధ్యాపకులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ దేవసేన, సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ బాల భాస్కర్, ప్రొఫెసర్ రాజేందర్ సింగ్ పాల్గొని విద్యార్థుల ప్రదర్శనను ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యార్థులు సీహెచ్ ప్రేమ్‌సాయి,ఈ. సాయికుమార్, పి. పేత్రు, శ్రుతి, అర్థశాస్త్ర విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఆర్. గోపాల్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

