September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*మంచిర్యాలలో 1,147 ఉద్యోగ అవకాశాలు.. ఆగస్టు 18న మెగా జాబ్ మేళా*

మంచిర్యాల,ఆగస్టు 16(నేటి ప్రజా తెలంగాణ): ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) మంచిర్యాల ఆధ్వర్యంలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు, విద్యార్థినులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు మెగా అప్రెంటిస్‌షిప్ / జాబ్ మేళా-2026 నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వర్ రావు తెలిపారు.మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించనున్న ఈ మేళాకు హైదరాబాద్‌తో పాటు దేవాపూర్, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన ప్రముఖ పరిశ్రమలు, కంపెనీలు హాజరై అభ్యర్థుల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. మొత్తం 1,147 ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఉద్యోగ అవకాశాల్లో ఫిట్టర్, వెల్డర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, CNC మెషిన్ టెక్నీషియన్, CNC మిల్లింగ్, CNC టర్నింగ్, డ్రాఫ్ట్స్‌మన్ సివిల్, COPA తదితర ట్రేడ్‌లకు అవకాశాలు ఉన్నాయి. కంపెనీలను బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ.19,000 వరకు జీతం/స్టైపెండ్ అందించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.ప్రధానంగా ఖాళీలు ఉన్న సంస్థలు: MTAR Pvt. Ltd.లో 150, Rane Madras Pvt. Ltd.లో 100, Schneider Electrical Pvt. Ltd.లో 100, Medha Servo Drives Pvt. Ltd.లో 100, Premier Energies Pvt. Ltd.లో 150, Dynamic Tools Pvt. Ltd.లో 20, Zen Technologies Pvt. Ltd.లో 80, L&T Constructions Pvt. Ltd.లో 100, Tata Aerospace Pvt. Ltd.లో 70, ITC Pvt. Ltd.లో 100, Shakti Hormann Pvt. Ltd.లో 100, Dynamic Aero Spaceలో 15, Orient Cements (Adani)లో 30, Adarsh Automobiles Ltd.లో 30, Sahasra Enterprisesలో 2 ఖాళీలు ఉన్నాయి.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు Resume/Bio-data, Apprenticeship Registration కాపీ, SSC మెమో, ITI మెమో, NTC సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్‌బుక్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని అధికారులు సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కోరారు.మరిన్ని వివరాలకు సెల్ నంబర్: 9844389325ను సంప్రదించవచ్చు.

Related posts

*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు*

*పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి ‘ప్రకృతిమిత్ర’ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తాం : సింగరేణి జీఎం శ్రీనివాస్*

మోడిని బలపర్చండి – దేశాన్ని కాపాడండి

Share this