August 5, 2026
Praja Telangana
తెలంగాణ

*ప్రస్తుత భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి*

చెన్నూర్,జులై 30:ప్రస్తుతం కురుస్తున్న వర్ష పరిస్థితులలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటి గోడ కూలిన ఘటనలో గాయాలై చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, ఆర్.ఎం.ఓ. లు భీష్మ, శ్రీధర్, కోటపల్లి మండల తహసిల్దార్ రాఘవేంద్ర లతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కోటపల్లి మండలం ఆలుగాం గ్రామానికి చెందిన ఆత్రం మాంతయ్య ఇంటి గోడ కూలి ఇంటిలో ఉన్న ఆత్రం లక్ష్మి తలకు, ఆత్రం అనిల్ చేతికి గాయాలై మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుత వర్ష పరిస్థితులలో ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వర్షాల కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూర్, క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్లకు తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా సంరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

“వేధింపులకు చెక్.. మహిళల రక్షణకు షీ టీమ్స్ అప్రమత్తం”_షీ టీం ఎస్ఐ ఉషారాణి

*నేరాల నియంత్రణలో రాజీ లేదు.. సాంకేతిక దర్యాప్తు, విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి : డీసీపీ ఎ. భాస్కర్*

Share this