September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*వేములపల్లిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి.. ఎనిమిది మంది అదుపులో, రూ.1.02 లక్షల నగదు స్వాధీనం*

మంచిర్యాల, జూలై 25: రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ బృందం, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేములపల్లి గ్రామంలో నడుస్తున్న పేకాట స్థావరాన్ని గుర్తించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం సాయంత్రం నిర్వహించిన దాడిలో నగదును పందెంగా పెట్టి మూడుముక్కల పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.1,02,000 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.అదుపులోకి తీసుకున్న నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Related posts

*పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి*

Share this