July 27, 2026
Praja Telangana
తెలంగాణ

*నెన్నెల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ.భాస్కర్*

నేన్నెల,జూలై 15:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో ఉన్న నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ ఎగ్గడి భాస్కర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన సిబ్బందితో మాట్లాడి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ సిబ్బందితో సమావేశమై ఆన్‌లైన్ నమోదు, రికార్డుల నవీకరణపై ఆరా తీసి ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే దర్యాప్తులో ప్రతి నేరస్థలాన్ని తప్పనిసరిగా సందర్శించి ఫోటోలు, వీడియోలతో ఆధారాలు సేకరించడంతో పాటు ఈ-సాక్ష్య వ్యవస్థలో వెంటనే నమోదు చేయాలని సూచించారు. పెండింగ్ కేసులు, నేరాల రికార్డులు, దర్యాప్తు పురోగతిపై సీఐ హనోక్, ఎస్‌ఐ రామకృష్ణరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి కానిస్టేబుల్ గ్రామ పోలీసు అధికారిగా గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, రహదారి భద్రత, హెల్మెట్, సీటుబెల్టు వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం రాత్రి పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు.

Related posts

బెల్లంపల్లి గురుకుల విద్యార్థుల ఆందోళన

ఫిల్టర్ బెడ్ ఏరియా మందమరిలో గుడుంబా పట్టివేత

Share this