September 13, 2026
Praja Telangana
తెలంగాణ

*ఆషాఢ అమావాస్య సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు.. భక్తుల రద్దీ*

హాజీపూర్,జూలై 14: ఆషాఢ మాసం ప్రారంభ దినమైన అమావాస్య, పాడ్యమి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను కేశిపెద్ది అంజాలమ్మ, రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆషాఢ మాసం తొలి రోజు అమావాస్య, పాడ్యమి కలిసిరావడం విశేషమని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని సంకల్పించి ప్రత్యేక హోమాలు, పూజలు, గ్రహదోష, గర్భదోష నివారణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.ప్రతి అమావాస్య సందర్భంగా గ్రహదోషాలు, గర్భదోషాల నివారణ కోసం ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి శాంతి హోమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Related posts

ఘనంగా ప్రపంచ నృత్య దినోత్సవం: భావాలను పలికించే నృత్యం – సంస్కృతిని నిలబెట్టే శక్తి

Chief Editor: Satish Kumar

రామగుండం కమిషనరేట్‌లో ఇంధన కొరత లేదు-రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

*హత్యాయత్నం కేసులో రౌడీ షీటర్ A1 గణేష్ అరెస్ట్.. కత్తి స్వాధీనం*

Share this