September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*ఆషాఢ అమావాస్య సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు.. భక్తుల రద్దీ*

మంచిర్యాల, జూలై 14: ఆషాఢ మాసం ప్రారంభ దినమైన అమావాస్య, పాడ్యమి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను కేశిపెద్ది అంజాలమ్మ, రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆషాఢ మాసం తొలి రోజు అమావాస్య, పాడ్యమి కలిసిరావడం విశేషమని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని సంకల్పించి ప్రత్యేక హోమాలు, పూజలు, గ్రహదోష, గర్భదోష నివారణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.ప్రతి అమావాస్య సందర్భంగా గ్రహదోషాలు, గర్భదోషాల నివారణ కోసం ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి శాంతి హోమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Related posts

*వీఐపీ భద్రతలో అప్రమత్తత, క్రమశిక్షణే కీలకం: సీపీ అంబర్ కిషోర్ ఝా*

బాల భరోసాతో చిన్నారులకు ప్రత్యేక వైద్యం__జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Chief Editor: Satish Kumar

Share this