September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*జ్యువెలరీ దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: ఎస్‌ఐ జే. శ్రీధర్*

రామకృష్ణాపూర్,జూలై 4:రామకృష్ణాపూర్ పట్టణంలోని జ్యువెలరీ దుకాణాల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని పట్టణ ఎస్‌ఐ జే. శ్రీధర్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పలు జ్యువెలరీ షాపులను ఎస్‌ఐ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, రికార్డింగ్ సామర్థ్యం, కెమెరాల కవరేజీని పరిశీలించి యజమానులకు పలు సూచనలు చేశారు. ప్రతి జ్యువెలరీ దుకాణంలో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి 24 గంటల పాటు నిరంతరం పనిచేసేలా నిర్వహించాలని సూచించారు. డీవీఆర్ రికార్డింగ్‌ను భద్రంగా భద్రపరచడంతో పాటు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.వ్యాపారులు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తే నేరాల నివారణకు దోహదపడుతుందని ఎస్‌ఐ జే. శ్రీధర్ తెలిపారు. జ్యువెలరీ దుకాణాల భద్రత విషయంలో యజమానులు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related posts

*గద్దెరేగాడిలో అనుమానాస్పద కాటుతో యువకుడి మృతి.. కేసు నమోదు చేసిన రామకృష్ణాపూర్ పోలీసులు*

తీవ్ర ఎండల ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Chief Editor: Satish Kumar

మోడీ క్యాంటీన్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ

Share this