July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*మంచిర్యాల కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ ఆందోళన.. అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్*

మంచిర్యాల,జూన్29:మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో మంగళవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో అవినీతి, నగర సమస్యలపై ప్రశ్నించిన బీజేపీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్‌ను సమావేశం నుంచి సస్పెండ్ చేయాలని మేయర్ ఆదేశించడంతో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు.కార్పొరేషన్ సమావేశ మందిరం ఎదుట బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ఆ ధ్వర్యంలో కార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతి,ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీజేపీ కార్పొరేటర్ల గొంతును అణిచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.కార్పొరేషన్‌లో జరుగుతున్న పనులపై సమగ్ర విచారణ చేపట్టాలని,ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించిన బీజేపీ కార్పొరేటర్లను సమావేశం నుంచి బయటకు పంపించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.చిన్న చిన్న మరమ్మతుల పనుల పేరుతో లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని,దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ప్రజల పన్నుల ద్వారా సమకూరే నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉండగా, దుర్వినియోగం చేయడం సరికాదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ పాలకవర్గం వ్యవహరించాలని సూచించారు.తమపై జరిగిన చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని,ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు,బీజేపీ నాయకులు,మహిళా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాల వేలం

37వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.డి ఖలీద్ ప్రచారం

*ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు… రోడ్డు ప్రమాదాల నివారణకు జైపూర్ పోలీసుల చర్యలు*

Share this