September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*వర్షంలోనూ విధి నిర్వహణకు అండగా.. పోలీస్ సిబ్బందికి రెయిన్‌కోట్లు అందజేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా*

రామగుండం,జూన్ 24:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.వర్షాకాలంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులు పడకుండా బుధవారం పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి రెయిన్‌కోట్లు అందజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎండ,వానలను లెక్కచేయకుండా రాత్రింబవళ్లు ప్రజల భద్రత కోసం పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో విధి నిర్వహణకు రెయిన్‌కోట్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు.వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు శేఖర్, మల్లేశం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులకు మేయర్ సూచనలు — సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యం

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభిమానిగా, సూరారం గ్రామ 5వ వార్డు నెంబర్ గా ఎల్లప్పుడూ గ్రామ ప్రజల కొరకు పని చేస్తాను

ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై కట్టడి అవసరం:

Share this