June 11, 2026
Praja Telangana
తెలంగాణ

*పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి*

శ్రీరాంపూర్, జూన్ 6: నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్‌లో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన సదస్సులో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.చెట్ల పెంపకం,ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ ద్వారా ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు.ప్రకృతి మిత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ పర్యావరణహిత అలవాట్లు పెంపొందించుకోవాలని,బట్ట సంచుల వినియోగం,మొక్కల పెంపకం,గ్రీన్ గిఫ్ట్‌ల ప్రోత్సాహం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.అనంతరం బట్ట సంచులను ఉచితంగా పంపిణీ చేసి, “ప్రకృతి విలపిస్తోంది” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రకృతి మిత్ర సభ్యులు, సింగరేణి కార్మికులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక

రైతులకు మేయర్ సూచనలు — సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యం

మండే ఎండల ముప్పు:మనుషులకే కాదు స్మార్ట్‌ఫోన్లకూ ప్రమాద ఘంటికలు – జేబులోనే పేలిన మొబైల్‌తో ప్రజలకు హెచ్చరిక

Share this